
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష సందర్భంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందును విజయవాడ ఎన్ఏసీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. వైసీపీ ఆధ్వర్యంలో ఇచ్చే ఇఫ్తార్ విందుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ హాజరయ్యారు. ముస్లింలకు ఈద్ ముబారక్ అంటూ ఉర్ధూలో రంజాన్ ముందస్తు శుభాకాంక్షలు చెప్పిన వైఎస్ జగన్ అందరి ప్రార్ధనలు సఫలం కావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.ప్రత్యేక ప్రార్థనల తర్వాత ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు.