
సైబర్ మోసాల కోసం నేరగాళ్లు తాజాగా ఇమేజ్ స్కామ్ పేరుతో కొత్త మోసానికి తెర లేపారు స్టెగానోగ్రఫీ సాంకేతికత సాయంతో స్కామర్లు ఈ మోసానికి పాల్పడతారు. ప్రమాదకరమైన కోడ్ కలిగిన ఇమేజ్ కోడ్‌ను మన వాట్సాప్‌కు పంపిస్తారు. ఈ ఇమేజ్‌ను తెరిస్తే.. మాల్‌వేర్ దానంతట అదే ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయి సున్నిత సమాచారాన్ని గ్రహిస్తుంది. స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే.. తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫొటో, వీడియో లేదా లింక్‌లను తెరవకూడదు. వాట్సాప్ సెట్టింగ్స్‌లో ఆటో డౌన్‌లోడ్ ఫీచర్‌ను ఆఫ్ చేయాలి.