తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇతర పార్టీల నుంచి అధికార పార్టీలోకి చేరాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇందులో భాగంగానే పలువురు బీఆర్ఎస్ నేతలు, ఇతర పార్టీలకు చెందిన నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు.అయితే భేటీ తర్వాత మర్యాదపూర్వకంగానే కలిశామని చెబుతున్నప్పటికి రాజకీయ ప్రయోజనాల కోసమే అనేది వినిపిస్తున్న మాట. తాజాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కీలక నేత ,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో పాటు వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి గురువారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు