
ఉక్రెయిన్లో శాంతి చర్చలకు అమెరికా, రష్యా సుముఖత వ్యక్తం చేశాయి. మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని రెండు దేశాల అధినేతలు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ ఫోన్లో చర్చించుకున్నారు. రెండు దేశాలూ 175 మంది యుద్ధ ఖైదీలను విడుదల చేసుకోనున్నట్లు ట్రంప్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 30 రోజులపాటు యుద్ధ విరమణకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించగా, పుతిన్ కూడా కొన్ని షరతులతో సమ్మతించారు.