
ముంబయి 26/11 మారణహోమం కుట్రదారుడు.. మోస్ట్ వాంటెడ్ తహవూర్ హుస్సేన్ రాణాకు అమెరికాలో చట్టపరంగా అన్ని అవకాశాలూ మూసుకుపోయాయి. దీంతో అతడ్ని అమెరికా అధికారులు భారత్కు అప్పగించారు. తనను ప్పగించడాన్ని నిలిపివేయాలని కోరుతూ, చివరిగా వేసిన పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు రెండు రోజుల కిందట తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానంలో రాణాను భారత అధికారులు తీసుకొస్తున్నారు. పాకిస్థాన్ మూలాలున్న కెనడా పౌరుడైన రాణా చికాగోలో స్థిరపడ్డాడు.