
దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. బెట్టింగ్ యాప్స్ ను జనం డౌన్ లోడ్ చేసుకోకుండా నిషేధించే పరిస్ధితి లేకపోవడంతో దానికి కౌంటర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఐటీ శాఖ ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను తయారు చేయిస్తోంది. ఐటీ శాఖ సహాయంలో కొత్త సాఫ్ట్ వేర్ ను తయారు చేయించి బెట్టింగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోగానే సదరు ఫోన్ సమాచారం తమకు వచ్చేలా చేయబోతోంది.