
హీరోయిన్ తాప్సీ పన్ను గొప్ప మనసు చాటుకుంది. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో గుడిసెల్లో ఉండే పేదలు ఎంత ఇబ్బంది పడతారో ఊహించింది తాప్సీ. అందుకే తన వంతు సాయంగా కొందరికి కూలర్లు, ఫ్యాన్స్ పంచింది. ఈ వేసవి నుంచి ఉపశమనం అందించేందుకు ముంబయి మురికివాడల్లో నివసిస్తున్న కొంతమంది పేదలకు టేదలకు ఫ్యాన్లు, మినీ కూలర్లు అందించింది ఈ భామ. భర్త మథియాస్ బోతో కలిసి ఈ ఛారిటీ కార్యక్రమంలో పాల్గొంది.