
పుష్ప 2 సినిమాలో నటించడం తన అదృష్టం అంటూ ఎమోషనల్ అయ్యారు అల్లు అర్జున్. శనివారం నాడు జరిగిన థాంక్స్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఐదు నిమిషాలు నుంచి ఐదు సంవత్సరాలకు పైగా పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. పుష్ప పోస్టర్లో నా ఫొటోని నేను చూసుకున్నప్పుడు ఎంత అదృష్టం అని అనిపిస్తుంది. వేలాదిమంది ప్రేమను నేను కలెక్ట్ చేసుకుని మీకు పుష్పరాజ్‌గా కనిపించాను.