
కేంద్రం పార్లమెంట్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియను కించపరుస్తున్నదని, సరైన చర్చలను అడ్డుకుంటున్నదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శనివారం ఆరోపించారు. ప్రియాంక గాంధీ వయనాడ్‌లో విలేకరులతో మాట్లాడుతూ,
ఏవిధంగానైనా చర్చలను నివారించడమే కేంద్ర ప్రభుత్వ దృక్పథం అని, అందుకు అది వివిధ వ్యూహాలు అనుసరిస్తోందని విమర్శించారు. ఎంపిలు అటువంటిదిచూడవలసి రావడం ‘అత్యంత శోచనీయం’ అని ఆమె వ్యాఖ్యానించారు.