
పసుపు రైతులు ఎవరు నష్టపోకుండా వారి పంటను కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ నామ్ పోర్టల్‌లో పసుపు పంటకు వచ్చే గరిష్ట ధరను ఆధారంగా చేసుకుని, నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా రైతులకు న్యాయమైన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి రైతుల చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను రాజేంద్రనగర్ పరిశోధన స్థానం నుండి శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా వివరించారు.