
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల్లో పని చేస్తున్న చిరు ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి శుభవార్త అందింది. ఇప్పటివరకు వీరు జీతాల కోసం నెలలు వేచి చూడాల్సి వచ్చేది. అయితే మే నెల నుంచి వారికీ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే నెలనెలా జీతాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయంతో పంచాయతీ ఉద్యోగుల్లో ఆనందావేశం నెలకొంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ పంపిన ఫైలుకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా ఈ ఉద్యోగుల జీతాల కోసం రూ. 115 కోట్లు కేటాయించనుంది.