
1971 జనాభా లెక్కల ప్రాతిపదికపై పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనను మరో 25 సంవత్సరాల పాటు వా యిదా వేయాలని కేంద్రానికి డిఎంకె నాయకత్వంలోని సంయు క్త కార్యాచరణ కమిటీ (జెఎసి) సమావేశం శనివారం విజ్ఞప్తి చే సింది. పార్లమెంట్ సభ్యులు తమ కోర్కెలపై ఒక ఉమ్మడి వినతిపత్రాన్ని ప్రస్తుత పార్లమెంటరీ సమావేశాల సమయంలోనే ప్రధాని నరేంద్ర మోడీకి సమర్పించాలని జెఎసి సమావేశం నిర్ణయించింది. ఈ ప్రక్రియలో అన్ని రాష్ట్రాల రాజకీ య పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం కల్పించాలి. వాటి తో చర్చించి.. వాటి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తీ ర్మానం కోరింది.