
నవ ప్రపంచాన్నినిర్మిద్దామని అందులో భాగంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ వ్యాపారవేత్తలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒసాకా ఎక్స్ పోలో ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను రేవంత్‌రెడ్డి జపాన్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న సిఎం బృందం సోమవారం ఉదయం భారత పెవిలియన్‌లోకి అడుగుపెట్టింది. జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న ఎక్స్‌పోలో రాష్ట్రానికి సంబంధించి తన ప్రత్యేకమైన పెవిలియన్‌ను సిఎం రేవం త్ ఈ సందర్భంగా ప్రారంభించారు.