
స్ఠాలిన్ ప్రభుత్వం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ లోగోలో ‘₹’ చిహ్నాన్ని తొలగించింది. దాని స్థానంలో తమిళంలో ‘రూ’ అనే అక్షరానికి చోటు కల్పించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. ఇది భారత ఐక్యతను దెబ్బతీసే వేర్పాటువాద భావజాలాన్ని ప్రోత్సహించడమేనని ఆరోపించారు. అధికారికంగా 2010లో కేంద్రం ఆమోదించిన సమయంలో డీఎంకే ఎందుకు వ్యతిరేకించలేదని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆమె నిలదీశారు. అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో డీఎంకే భాగస్వామ్యపక్షంగా ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తుచేశారు.