
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ డిజిటల్ స్ట్రీమింగ్ లో రికార్డు స్థాయిలో వీక్షించడంతో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ ను జియో హాట్స్టార్ ప్లాట్ఫామ్లో 53 కోట్లకు పైగా లైవ్ వీక్షించారు. 33వ ఓవర్ లో 53.3 కోట్లు (533 మిలియన్లు) ఒకేసారి దాయాదుల పోరును ఇంట్లో కూర్చుని చూశారు. భారీ స్థాయిలో వ్యూస్ తో జియో హాట్ స్టార్ కొత్త రికార్డులు నెలకొల్పింది.