
తిరుమలలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల కొందరు దళారుల చేతుల్లో మోసపోతున్న ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. శ్రీవారి దర్శనాలు, సేవలు, గదులు సహా తదితర టికెట్ల బుకింగుల్లో దళారులకు చెక్ పెట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఆధార్ ఆథెంటికేషన్, ఈకేవైసీలను ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందుకు గతేడాది ఆగస్టు 5న కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ అనుమతి తెలిపింది. తాజాగా, ఆధార్ అథెంటిఫికేషన్, ఈ కేవైసీల అమలకు సంబంధించిన నోటిఫికేషన్ను దేవాదాయ శాఖ గెజిట్లో శనివారం ప్రచురించింది.