
ఇంజినీర్ రషీద్‌గా ప్రసిద్ధి చెందిన అబ్ధుల్ రషీద్ షేక్ బారామూల్లా లోక్‌సభ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఒమర్ అబ్దుల్లాను ఓడించి విజయం సాధించారు. .. 2017లో ఉగ్రవాదానికి నిధులు సుమకూర్చారనే ఆరోపణలతో ఎన్ఐఏ ఎంపీ రషీద్‌ను అరెస్ట్ చేసింది ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. రషీద్ కస్టడీలో పార్లమెంట్‌కు హాజరు కావాలని.. పోలీసులే తమ ఎస్కార్ట్‌లో తీసుకెళ్లాలని వివరించింది. అలాగే పార్లమెంట్ వద్ద ఎంపీ ఎవరితోనూ మాట్లాడకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.