
ఐరోపాలో జరుగుతున్న జీటీ4 కార్ రేస్‌లో దుమ్మురేపాడు స్టార్ హీరో అజిత్ కుమార్, ఒంటరిగా ఈ రేస్ లో పాల్గొని అదరగొట్టాడు స్టార్ హీరో. సినిమాతో పాటు కార్ రేస్ అంటే అజిత్‌కి ఎంతో ఇష్టం. ఐరోపాలో జీటీ4 కార్ రేస్ మొదలైంది. ఇద్దరు పాల్గొనే ఈ రేస్‌లో అజిత్ ఒక్కడే పాల్గొన్నాడు. రూల్స్ ప్రకారం ఇద్దరు ఉంటే ఒకరు రేస్ పూర్తి చేశాక మరొకరు కారు నడుపుతారు. ఒక్కరే అయితే కారు ఆపి దిగి మళ్ళీ ఎక్కాలి. అజిత్ అలాగే చేశాడు.