
చిరంజీవికి తాజాగా అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించిన విషయం తెలిసిందే. దీంతో చిరుకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడంపై పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ.. ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ పురస్కారం చిరంజీవి కీర్తిని మరింత పెంచిందని తెలిపారు.