
బహిరంగ చర్చలు, నిష్పాక్షికతలను పణంగా పెట్టి, ఎటువంటి కారణం లేకుండా, మీడియా రిపోర్టింగ్‌ను తొలగించాలని ఆదేశించడం కోర్టుల విధి కాదని సుప్రీంకోర్టు శుక్రవారం చెప్పింది. ఏఎన్ఐ వార్తా సంస్థకు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. వికీమీడియా ఫౌండేషన్‌పై ఏఎన్ఐ దాఖలు చేసిన పరువు నష్టం దావా వివరాలను వికీపీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు. ఈ పేజ్‌ను తొలగించాలని వికీమీడియా ఫౌండేషన్‌ను గతంలో హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.