
ఒక సినిమా పూర్తి అయిన తర్వాత విడుదల కావడానికి మధ్యలో సెన్సార్ కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. ఈ మధ్య కాలంలో ఓ టి టి లోకి వచ్చే కంటెంట్లో మితిమీరిన శృంగారం , హార్రర్ , రక్తపాతం , ఆశ్లీల సంభాషణలు ఉండడం సర్వసాధారణంగా గమనిస్తున్నాం. ఇలాంటి వాటిని అడ్డుకోవడం కోసం తాజాగా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ ఓ టి టి సంస్థలకు ఆదేశాలను ఇచ్చింది. మితి మీరిన రక్తపాతం , శృంగారం , జనాలను ఇబ్బంది పెట్టే మాటలను వచ్చే కంటెంట్ ను లేకుండా చూసుకోండి అని ఓ లేఖను విడుదల చేసింది.