
ఆంధ్రప్రదేశ్లో రేపటి (మార్చి 17న) నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పదో తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్టు ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.
ఏపీవ్యాప్తంగా మొత్తం 649884 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనుండగా.. వీరి కోసం 3450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా సమయానికి ముందే కేంద్రానికి విద్యార్థులు చేరుకునేలా బస్సుల సర్వీసులను నడుపనున్నట్టు కూడా తెలిపారు.