
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ తిరస్కరించింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో శనివారం ఎంఐఎం హెడ్‌క్వార్టర్ దారుస్సలాంలో బహిరంగ సభ జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన వేలాదిమందితో ఆ ప్రాంగణం కిక్కిరిసింది. ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకులు, ముస్లిం మత పెద్దలు, మేధావులు, ఎంఐఎం నేతలు పాల్గొని వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇది రాజ్యాంగ ఉల్లంఘనగా పేర్కొన్నారు.