
ఏపీ రాజధాని అమరావతి పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. అమరావతి పనులు అట్టహాసంగా తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వము రుణాల కోసం ఏడిబీ, ప్రపంచ బ్యాంకు, హడ్కోలతో ఒప్పందం చేసుకుంది. అమరావతిలో 48 వేల కోట్లతో 73 పనులకు ఏపీ ప్రభుత్వం ఇదివరకే పరిపాలన ఆమోదం తెలిపింది. ఇందులో 40 వేల కోట్ల విలువచేసే 62 పనులకు టెండర్లు సైతం ఆహ్వానించారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న సీఆర్డీఏ సమావేశంలో దీనికి ఆమోదం తెలపనున్నారు.