కూల్ సిటీ.. గ్రీన్ సిటీ.. సిలికాన్ సిటీ అని ఎన్నో పేర్లు ఉన్న బెంగళూరుకు నిత్యం పర్యాటకులు వస్తూనే ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం పంద్రాగస్టు వేడుకల సందర్భంగా లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్‌లో విభిన్నమైన థీమ్‌తో అద్భుతమైన ఫ్లవర్ షో నిర్వహిస్తారు. ఈ లాల్‌బాగ్ గార్డెన్‌లో రకరకాల పువ్వులతో అలంకరిస్తారు.ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ను సన్మానించే విధంగా, ఆయన దేశానికి ముఖ్యమైన పాత్రను వివరించేలా పుష్ప ప్రదర్శన నిర్వహిస్తున్నారు.