దేశవ్యాప్తంగా 48 సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశ (CUET) పరీక్షలు రేపు 11వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి సీఈయూటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమతోపాటు కేవలం ట్రాన్సపరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే తీసుకువెళ్లాలి. పరీక్షకు కనీసం గంట ముందు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. లైట్ దుస్తులను మాత్రమే ధరించాలి. షూస్ వేసుకోకూడదు. కేవలం స్లిప్పర్స్ మాత్రమే అనుమతిస్తారు. సీఈయూటీ యూజీ అడ్మిట్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన ధ్రువపత్రం కూడా తమతోపాటు తీసుకువెళ్లాలి.