ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గుజరాత్‌కు చెందిన యాత్రికులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు, రోడ్డు పక్కన నిలిపి ఉంచిన డీసీఎం వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.గుజరాత్ రాష్ట్రానికి చెందిన సుమారు 40 మంది యాత్రికులు విజయవాడ నుంచి శ్రీశైలం దర్శనానికి బయలుదేరారు.