ఉత్తరప్రదేశ్‌కు చెందిన అవదేష్‌కుమార్ (38)సంగారెడ్డి రూరల్ ఫసల్‌వాదీలో గ్రాంలో పొలంలో కూలీ పనుల కోసం వచ్చి వరి నాట్లు వేసి కూరగాయల కోసం సంగారెడ్డికి ద్విచక్రవాహనంపై వెళుతుండగా గాలిపటాలు ఎగురవేసే దారం ఎడకు తగిలి తీవ్ర రక్త స్రావం కాగా స్థానికులు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయాడని తెలిపారు. మృతుడి కుమారుడు పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని చైనా మాంజాను స్వాధీనం చేసుకొని మృతదేహాన్నీ పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.