‘జనాలకు ఎవ్వరైనా వస్తున్నాడంటే ఎగబడి వెళ్లడం అలవాటుగా మారిపోయింది. రాజకీయ నాయకులు కూడా జనాలు పోగేసి, తమ పలుకుబడి చూపించాలని అనుకుంటున్నారు. దీనికి ఇకనైనా ముగింపు పలకాలి. నేను, ఎవ్వరినీ తప్పు పట్టాలని అనుకోవడం లేదు. దీనికి ఏ ఒక్కరినో తప్పు బట్టడం కరెక్ట్ కాదు. మనందరం కూడా బాధ్యులమే! మీడియా కూడా దీనికి కారణమే.. ఓ సమాజంగా ఇలా గుంపుగా గుమిగూడితే జరిగే అనార్థాల గురించి కనీస విచక్షణ ఉండడం చాలా ముఖ్యం.. జనాల్లో చైతన్యం తేవాలి..

