జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్పై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. బాబా ఫసీయుద్దీన్పై చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్పీ పోలీసులను డిమాండ్ చేశారు. బెదిరింపులకు పాల్పడి, సర్దార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకునేలా ఉసి గొల్పి, బహిరంగంగా అందరినీ బెదిరిస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్న కాంగ్రెస్ కార్పోరేటర్ బాబా ఫసీయుద్దీన్ను పోలీసులు ఎందుకు బైండోవర్ చేయడం లేదు? అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు.

