ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా భీకర దాడి జరిపింది. రష్యా ఏకంగా 700 డ్రోన్లు, అత్యంత వేగంగా దూసుకెళ్లే అధునాతన ‘ఓరేష్నిక్’ హైపర్సోనిక్ క్షిపణులతో సహా 50 కి పైగా క్రూయిజ్ క్షిపణులను కీవ్ నగరంపైకి ప్రయోగించింది. నివాస భవనాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గిడ్డంగులు ఈ దాడుల్లో తీవ్రంగా ధ్వంసమయ్యాయి. బాంబుల పేలుళ్ల శబ్దాలతో రాజధాని నగరం దద్దరిల్లిపోవడంతో ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రజలు మెట్రో స్టేషన్లు, భూగర్భ బంకర్లలో ఆశ్రయం పొందారు.