ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తమ ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది . ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 30 పరుగుల తేడాతో విజయం రాజస్తాన్ (16 పాయింట్లు).. నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్
అర్హత సాధించింది. దీంతో పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.