ఏపీలో ఒక్కసారిగా వాతవరణం మారింది. భానుడి భగభగలతో అల్లాడిపోయిన ప్రజలకు ఊరట కలిగిస్తూ రాష్ట్రంలో వర్షం కురిసింది. ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఎండ ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలు కాస్త ఊరట చెందారు. ఇదిలాఉంటే ద్రోణి ప్రభావంతో కాసేపట్లో మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.