‘‘నిన్న ఇద్దరు యువ మిత్రులు సేవా తీర్థ్ (ప్రధానమంత్రి అధికారిక నివాసం)కు వచ్చారు’’ అని మోదీ పేర్కొన్నారు. రామ్మోహన్ నాయుడు కొడుకు, కూతురితో సరదాగా గడిపిన ఫొటోలను షేర్ చేశారు. వివరాలు… కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం రోజున ప్రధాని మోదీని ఆయన అధికారిక నివాసంలో కలిశారు. రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రామ్మోహన్ నాయుడు వెంట ఆయన సతీమణి శ్రావ్య, తల్లి, కొడుకు, కుమార్తె ఉన్నారు.