నారాయణఖేడ్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యం రెడ్డికి..కల్పన వీరికి 11 ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల కుమార్తె ఉన్నారు. నర్సుగా పనిచేస్తున్న కల్పనకు.. పండరి అలియాస్ చింటూతో పరిచయం క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. తమ సంబంధానికి భర్త ముత్యం రెడ్డి అడ్డుగా ఉన్నాడని ముత్యం రెడ్డిని హత్య చేసిన నిందితులు.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు గ్రామ శివారులోని తమ వ్యవసాయ పొలంలో జేసీబీతో పెద్ద గొయ్యి తీయించారు. అనంతరం మృతదేహాన్ని అందులో పూడ్చిపెట్టి.. పైభాగంలో రాళ్లు వేసి ఆనవాళ్లు కనిపించకుండా చేశారు.