రాజమండ్రిలోని మున్సిపాలిటీకి చెందిన బ్లీచింగ్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 500 బస్తాల బ్లీచింగ్ పౌడర్ పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. భారీగా మంటలు వ్యాపించడంతో గోడౌన్‌లో ఉన్న నిల్వలు బూడిదయ్యాయి.