శ్రీశైలం మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. సున్నిపెంట జెన్ కో కాలనీ సమీపంలో ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజామున చిరుత కనిపించింది. ఓ ఇంటి ముందు సంచరిస్తూ స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. ఆపై ఇనుప బాక్స్‌లోని కోడిని తినేందుకు ప్రయత్నించింది. ఎంతసేపు ప్రయత్నించినా కోడి చిక్కకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.
దీనికి సంబంధించిన వీడియోను ఆ ఇంటి వారు తమ సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. సున్నిపెంట శివారుల్లో తరచుగా చిరుతపులులు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.