అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కాల్పుల ఘటనలో నిందితుడిని నసీర్ బెస్ట్‌గా గుర్తించారు. గత కొన్నేళ్లుగా వైట్ హౌస్ పరిసరాల్లోని సెక్యూరిటీ జోన్ల వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఏడాదిక్రితమే వైట్‌హౌస్ నిషేధిత ప్రాంతాల్లోకి అక్రమంగా చొరబడినందుకు రెండు సార్లు పోలీసులు ఇతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు కూడా వైద్య నివేదికలను బట్టి భద్రతా సంస్థలు నిర్ధారించాయి. ముఖ్యంగా నసీర్ బెస్ట్ తనను తాను ఏసుక్రీస్తుగా భావించేవాడని చెప్పారు.