2010 ఫిఫా వరల్డ్ కప్‌లో “వాకా వాకా” పాటతో ప్రపంచాన్ని ఊపేసిన కొలంబియన్ పాప్ స్టార్ షకిరా, ఇప్పుడు మరోసారి ఫుట్‌బాల్ మైదానాన్ని షేక్ చేయడానికి సరికొత్త యాంథమ్‌తో సిద్ధమైంది. ప్రముఖ ఆఫ్రోబీట్స్ ఐకాన్ బర్నా బాయ్‌తో కలిసి ఆమె పాడిన ఫిఫా వరల్డ్ కప్ 2026 అధికారిక ఆల్బమ్ సాంగ్ “డాయ్ డాయ్” మ్యూజిక్ వీడియో తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. పిల్లల విద్య, ఫుట్‌బాల్ అవకాశాల కోసం ఈ పాట ద్వారా తనకు వచ్చే రాయల్టీలను షకిరా విరాళంగా ఇస్తోంది.