అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. సీక్రెట్ సర్వీస్ చెక్ పాయింట్ దూసుకొచ్చిన ఓ దుండగుడు బలగాలపై కాల్పులకు దిగాడు. దీంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు
తెలిపారు.వైట్ హౌస్ సమీపంలో వరుస కాల్పుల శబ్దాలు విన్నట్లు జర్నలిస్టులు తెలిపారు. కాల్పుల సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్హౌస్లోనే ఉన్నారు.