loader

బాన్సువాడలో ఉద్రిక్త పరిస్థితులు.. పోలీసుల లాఠీచార్జ్‌..!

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.రెండు వర్గాల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ చివరకు పోలీసుల లాఠీచార్జికి దారి తీసింది. స్థానికంగా ఉన్న ఒక సూపర్ మార్కెట్లో ఓ మతానికి చెందిన పాట పెట్టడంపై మరో మతానికి చెందిన వ్యక్తి అభ్యంతరం తెలిపాడు. దాంతో.. వివాదం చెలరేగింది. ఆ వాగ్వాదం కాస్త పెద్దదవ్వడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దాంతో.. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

అల్ అక్సా మసీదులో భారీ జనసందోహం

పవిత్ర రంజాన్ నెలలో తొలి శుక్రవారం సందర్భంగా వేలాది మంది పాలస్తీనియన్లు జెరూసలెంలోని Al-Aqsa Mosque వద్ద ప్రత్యేక నమాజ్‌లో పాల్గొన్నారు. ఇస్లాం మత విశ్వాసులకు అత్యంత పవిత్ర స్థలాల్లో ఒకటైన ఈ మసీదు ప్రాంగణంలో భక్తులు ప్రార్థనలు చేశారు. రంజాన్ తొలి జుమ్మా కావడంతో భారీ సంఖ్యలో జనసందోహం కనిపించింది. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా అమలు చేయగా, పాత నగరం ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ భక్తులు శాంతియుతంగా ప్రార్థనలు నిర్వహించారు.

పిల్లల లైంగిక వీడియోలు రికార్డ్‌ చేసి అమ్మకం.. దంపతులకు మరణశిక్ష

పిల్లలను లైంగికంగా వేధించడంతోపాటు లైంగిక వీడియోలు రికార్డ్‌ చేసి విదేశీయులకు, డార్క్‌ వెబ్‌లో అమ్మారు. సీబీఐ దర్యాప్తు చేసిన ఈ కేసులో భార్యాభర్తలకు పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌ జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజినీర్ రామ్ భవన్, అతడి భార్య దుర్గావతి సమీప జిల్లాలకు చెందిన ఐదు నుంచి 16 ఏళ్ల పిల్లలను మభ్యపెట్టి […]

ట్రంప్ విధించిన టారిఫ్‌లను కొట్టేసిన అమెరికా సుప్రీం కోర్టు.. అసలు నీకు సుంకాలు విధించే అధికారమే లేదు..

అమెరికా సుప్రీంకోర్టు నేడు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఏకంగా ఆ దేశం అధ్యక్షుడి తీరుని తప్పు పట్టింది. తన మాట వినని ప్రపంచ దేశాలపై అనవసరంగా అధిక సుంకాలను విధించడం అమెరికా చట్టాలకు వ్యతిరేకం అని తేల్చి చెప్పేసింది. అసలు ఆయన విధించిన సుంకాలు చెల్లవని చెప్పింది. అంతేకాదు ఆ సుంకాలను కోర్టు కొట్టేసింది. అలాగే ఈ డబ్బులను తిరిగి ఇవ్వాల్సిందేనని నొక్కి చెప్పింది. దీంతో అమెరికాన్ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పైకి లేచింది.

జోడోలో రాహుల్‌తో ఉన్న వ్యక్తి పనే ఇది.. పాత ఫోటో విడుదల చేసిన బీజేపీ

ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు శుక్రవారంనాడు వీరంగం చేయడం, చొక్కాలు విప్పి నిరసన తెలపడం ఆ పార్టీని వివాదంలోకి నెట్టింది. అయితే ఈ చర్యను కేంద్ర మంత్రులతో సహా బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో భారత్‌జోడో యాత్రలో రాహుల్‌తో కనిపించిన వ్యక్తే ఏఐ ఇంపాక్ట్ సదస్సులో వీరంగం చేసినట్టు బీజేపీ నేత అమిత్‌ మాలవీయ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక ఫోటోను […]

ఏఐ సదస్సులో నిరసనకారులపై కొరడా.. పోలీసుల గాలింపు

ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో వీరంగం చేసిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు కొరడా ఝళిపించారు. ప్రధానమంత్రి మోదీకి, అమెకాతో వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా చొక్కాలు విప్పి నిరసనలకు దిగిన కార్యకర్తలు అక్కడి నుంచి హడావిడిగా నిష్క్రమించారు. వేదక వద్దే నలుగురిని నిర్బంధంలోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు వారిని పాటియాలా హౌస్ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. తక్కిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. రూ. 2 కోట్లకు పైగా నగదు సీజ్..

నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం కేంద్రంగా సాగుతున్న భారీ క్రికెట్ బెట్టింగ్, ఇన్వెస్ట్‌మెంట్ మోసాల నెట్‌వర్క్‌ను నెల్లూరు జిల్లా పోలీసులు ఛేదించారు. అమాయక యువకులను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల దందా నిర్వహిస్తున్న ముఠా నాయకులను కటకటాల్లోకి నెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన బెట్టింగ్ మాఫియా లీడర్లు కూసెట్టి వేణుగోపాల్, బిట్ర వెంకటరమణ అధిక లాభాలు వస్తాయంటూ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో యువకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని తెలిపారు.

మరో భారత క్రికెటర్ విడాకులు..భార్యతో విడిపోయినట్లు ప్రకటించిన చాహర్..

భారత క్రికెటర్ రాహుల్ చాహర్, తన భార్య ఇషానీ జోహార్‌తో విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన వీరి వివాహ బంధం ముగియడంపై రాహుల్ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. గత కొద్ది కాలంగా వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత స్పిన్నర్ రాహుల్ చాహర్, తన వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఫ్యాషన్ డిజైనర్ అయిన ఇషానీ జోహార్‌తో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

మాజీ కార్టూనిస్ట్‌కు కేబినెట్ ర్యాంక్ హోదా.. ప్రభుత్వ సలహాదారుగా కీలక బాధ్యతలు..!

తెలుగు పాఠకులకు సుపరిచితులైన మాజీ కార్టూనిస్ట్ పోచంపల్లి శ్రీధర్ రావును ఉన్నత పదవి వరించింది. తన కళా నైపుణ్యంతో విశేష గుర్తింపు పొందిన ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ హోదాతో గౌరవించింది. సమాచార ప్రచార విభాగానికి సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా ఆయన వ్యహరించనున్నారు. ప్రభుత్వ సలహాదారుగా శ్రీధర్‌ను నియమిస్తూ శుక్రవారం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామల రావు ఉత్తర్వులు జారీ చేశారు.

ఏఐ వాడితేనే ప్రమోషన్లు.. లేకుంటే తొలగింపు.. ఉద్యోగులకు యాక్సెంచర్ వార్నింగ్

వర్కింగ్ కల్చర్‌ను ఏఐ మార్చేస్తోంది. రాకెట్‌లా దూసుకెళ్తున్న ఏఐని ఇప్పుడు కొన్ని కంపెనీలు వరప్రసాదంలా భావిస్తున్నాయి. ఉద్యోగుల చేత ఏఐని తప్పనిసరిగా వాడేలా చేస్తున్నాయి. తాజాగా టెక్ కంపెనీ యాక్సెంచర్ ఈ విషయంలో ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సీనియర్ ఉద్యోగులు ఏఐని తప్పనిసరిగా వాడాలని సూచించింది. లేకుంటే ప్రమోషన్లు కట్ చేస్తామని హెచ్చరించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON