రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాల నాలుగో అంతస్తు పైనుంచి దూకి చనిపోయింది. 9 ఏండ్ల బాలిక నాలుగో అంతస్తు గ్రిల్ ఎక్కి దూకినట్లు అక్కడ ఉన్న కెమెరాలో రికార్డు అయిందిబాలిక 47 అడుగుల పై నుంచి పడిందని యాజమాన్యం చెప్పినప్పటికీ.. ఎలాంటి రక్తపు మరకలు లేకపోవడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వచ్చేలోపే రక్తపు మరకలను ఎందుకు తూడ్చేశారనే విషయమై పోలీసులు ఆరాతీస్తున్నారు

