తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తమిళనాడు మంత్రి పీ. విశ్వనాథన్ కలిశారు. ఆదివారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పీ.విశ్వనాథన్ ను సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. అంతకుముందు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆయన స్వగృహంలో పీ. విశ్వనాథ్ కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటి ఆయను ఘనంగా సత్కరించారు. తమిళనాడు
టీవీకే ప్రభుత్వంలో పీ.విశ్వనాథ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతర తెలంగాణలో పర్యటించడం ఇదే తొలిసారి.