రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి AR రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ రోజు హల్లలల్లో..హాల్లో అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని కొద్దిసేపటి క్రితం ఆన్లైన్ వేదికగా విడుదల చేసారు. పెద్ది పక్కన శృతి హాసన్ అదరగొట్టే డాన్స్ తో ఊపేసేలా ఉన్న ఈ సాంగ్ లో హీరోయిన్ జాన్వీ కూడా మెరిశారు. బావ సీరా, సొక్కా, సిక్కడి పోవాలో..అంటూ ఉత్తరాంధ్ర యాసలో సాగే ఈ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది.