బీహార్ అసెంబ్లీ ఎన్నికల బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీఏ ఎన్నికల మ్యానిఫెస్టో, బీహార్ అభివృద్ధి గురించి కీలక ప్రకటన చేశారు. “దేశంలో అత్యధిక యువ జనాభా ఉన్న రాష్ట్రాలలో బీహార్ ఒకటి, అందుకే బీహార్‌లో విద్య, నైపుణ్యాలకు ఎన్డీఏ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. బీహార్ యువత బీహార్‌లోనే పని చేసి బీహార్‌కు ఖ్యాతిని తీసుకురావాలనేది మా సంకల్పం, బీహార్‌ను మేడ్ ఇన్ ఇండియా కేంద్రంగా మార్చడమే మా లక్ష్యం. దీని కోసం, , కుటీర పరిశ్రమలను బలోపేతం చేస్తాము” అని అన్నారు.

