కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.రెండు వర్గాల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ చివరకు పోలీసుల లాఠీచార్జికి దారి తీసింది. స్థానికంగా ఉన్న ఒక సూపర్ మార్కెట్లో ఓ మతానికి చెందిన పాట పెట్టడంపై మరో మతానికి చెందిన వ్యక్తి అభ్యంతరం తెలిపాడు. దాంతో.. వివాదం చెలరేగింది. ఆ వాగ్వాదం కాస్త పెద్దదవ్వడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దాంతో.. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

