తెలంగాణలో ఎన్నికల కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో పడేయడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా ఫ్యూచర్ సిటీ అంటూ గొప్పలు చెబుతున్నారని, కానీ ప్రస్తుతం ఉన్న నగరంలోనే కనీస సౌకర్యాలు కల్పించే దిక్కులేదని ఇక్కడి సమస్యలు తీర్చలేని నాయకుడు ఫ్యూచర్ సిటీని ఏం నిర్మిస్తాడని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును అవమానించేలా బీజేపీ ఎంపీ మాట్లాడినా, ఇక్కడి కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నోరు మెదపకుండా మౌనంగా ఉండిపోయారని మండిపడ్డారు.