ఏపీ లిక్కర్ స్కాంలో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కావాలనే మాజీ మంత్రి జోగి రమేశ్‌ను అరెస్టు చేశారని ఆయన సతీమణి శకుంతల ఆరోపించారు. తన భర్తపై చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ కక్ష పెట్టుకున్నారని, గతంలో అగ్రి గోల్డ్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఇప్పుడు కావాలనే నకిలీ మద్యం కేసులో ఇరికించారని అన్నారు. ఇవాళ ఉదయం తమ ఇంటికి వచ్చిన పోలీసులు, తలుపులు మూసేసి దౌర్జన్యంగా వ్యహరించారని అన్నారు.

