దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు పట్టణాలు, నగరాలు, గ్రామాల పేర్లను మార్చే ప్రక్రియ కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు అదే తరహాలో ఢిల్లీ బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేవాల్.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు ఒక లేఖ రాశారు.
ఢిల్లీ నగరానికి ఉన్న ఘనమైన ప్రాచీన వారసత్వం, సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని.. ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలని ఆయన కోరారు. ఎంపీ ప్రవీణ్ ఖండేవాల్ తన లేఖలో ఢిల్లీ చారిత్రక ప్రాముఖ్యతను గుర్తు చేశారు.

