మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన భారీ అకాల వర్షం కురవడంతో భారీ వేగంతో వీచిన ఈదురు గాలుల ధాటికి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద వృక్షాలు, భారీ కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. ముఖ్యంగా ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు నేలకూలడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపైకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడం, దానికితోడు చెట్లు అడ్డంగా పడిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.